Nizampet: బాచుపల్లి పత్తికుంట చెరువును పరిరక్షించాలి

Nizampet: అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా కలుషితమైందని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 May 2026 12:21 PM IST
Nizampet
X

Nizampet: బాచుపల్లి పత్తికుంట చెరువును పరిరక్షించాలి

నిజాంపేట్: బాచుపల్లి హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న దాదాపు 11 ఎకరాల విస్తీర్ణం గల పత్తికుంట చెరువు 2020 వరకు మంచినీటి చెరువుగా ఉండేదని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తెలిపారు. అయితే నిజాంపేట్ కార్పొరేషన్ ఏర్పడిన అనంతరం పై ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజ్ నీటిని పైప్‌లైన్ ద్వారా చెరువులోకి మళ్లించడం వల్ల ప్రస్తుతం చెరువు పూర్తిగా కాలుష్యానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సంవత్సరం పొడవునా డ్రైనేజ్ నీరు చెరువులో కలవడం కారణంగా గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి, దుర్వాసన వ్యాపిస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరువులోకి డ్రైనేజ్ నీరు చేరకుండా తక్షణమే డ్రైనేజ్ పైప్‌లైన్‌ను రాజీవ్ గాంధీ నగర్ వరకు పొడిగించి మళ్లించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువును పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. దీనికి సంబంధించి CMC మరియు నిజాంపేట్ సర్కిల్ అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని కాలనీవాసులు కోరారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story