Parigi: పరిగిలో 'మట్టి' మాఫియా పంజా.. కొండలు మాయం, జేబులు నిండుతున్నాయి!

Parigi: పరిగిలో మట్టి మాఫియా ఆగడాలు. రాత్రిపూట యధేచ్ఛగా సాగుతున్న కొండల విధ్వంసం.

WAZID, PARIGI
Published on: 9 Jun 2026 1:06 PM IST
Parigi
X

Parigi: పరిగిలో 'మట్టి' మాఫియా పంజా.. కొండలు మాయం, జేబులు నిండుతున్నాయి!

Parigi: "ప్రకృతిని కాపాడాల్సిన చేతులే, స్వార్థంతో దానిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. పరిగి గడ్డపై ఇప్పుడు మట్టి మాఫియా రాజ్యమేలుతోంది!

సూర్యుడు అస్తమించి, చీకటి పడిందంటే చాలు.. పరిగి రోడ్లపై మట్టి లారీలు యదేచ్ఛగా ప్రయాణిస్తాయి. ఊరు నిద్రపోతుంటే.. అక్రమార్కులు మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతూ, ప్రకృతిని కొల్లగొడుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, కొండలను కరిగించేస్తున్నారు.

పగటిపూట కనిపించని ఈ అక్రమ రవాణా, రాత్రి పూట మాత్రం ఎలా సాగుతోంది? అధికారుల కళ్లు కప్పడం సాధ్యమేనా? లేక అధికారుల కళ్ల ముందే, వారి ఆశీస్సులతోనే ఈ దందా నడుస్తోందా?

రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల అండదండలు లేనిదే, ఒక చిన్న ట్రాక్టర్ మట్టి కూడా కదలని చోట.. వందలాది లారీలు ఎలా తిరుగుతున్నాయి? స్థానికులు ఆరోపిస్తున్నట్లు.. 'మామూళ్ల' మత్తులో అధికార యంత్రాంగం ఉందా? లేక ఈ అక్రమాల్లో వారికి కూడా వాటాలు అందుతున్నాయా?

కొండలను తవ్వేస్తుంటే పర్యావరణం ఏమైపోవాలి? భూగర్భ జలాలు అడుగంటి, భవిష్యత్తులో మనం ఏం తాగాలి? జేబులు నింపుకునే ఈ స్వార్థపరులకు, సమాజం పట్ల బాధ్యత లేదా?

ప్రకృతిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుంది.. కానీ దానిని కొల్లగొడితే వినాశనం తప్పదు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలి.జిల్లా ఎస్పీ దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story