Cyber Crime: సైబర్ నేరగాళ్ల మాయాజాలం.. ఏకంగా పోలీస్ కమిషనర్ పేరుతోనే మోసాలు
Cyber Crime: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించారు.
Cyber Crime: సైబర్ నేరగాళ్ల మాయాజాలం.. ఏకంగా పోలీస్ కమిషనర్ పేరుతోనే మోసాలు
Cyber Crime: సికింద్రాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సుమతి పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ సృష్టించి పలువురికి డబ్బులు పంపించాలని మెసేజ్‌లు పంపిన ఘటన కలకలం రేపుతోంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి, పరిచయస్తులకు, ఇతరులకు ఆర్థిక సహాయం పేరుతో డబ్బులు పంపాలని సందేశాలు పంపినట్లు సమాచారం.
ఈ విషయాన్ని గుర్తించిన కమిషనర్ కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. అనంతరం అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఇది పూర్తిగా ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. సైబర్ నేరగాళ్లు అధికారుల పేర్లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు వెంటనే ధృవీకరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు లేదా డబ్బులు అడిగే అభ్యర్థనలపై స్పందించవద్దని హెచ్చరించారు.




