Quthbullapur: పేట్ బషీరాబాద్‌లో దారుణం.. అదనపు చట్నీ వివాదంలో కత్తితో దాడి!

Quthbullapur: హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జై భవాని టిఫిన్ సెంటర్‌లో అదనపు చట్నీ విషయంలో మొదలైన వివాదం కత్తితో దాడికి దారితీసింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 May 2026 3:27 PM IST
Quthbullapur
X

Quthbullapur: పేట్ బషీరాబాద్‌లో దారుణం.. అదనపు చట్నీ వివాదంలో కత్తితో దాడి!

Quthbullapur: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఉన్న జై భవాని టిఫిన్ సెంటర్ వద్ద జరిగిన చిన్న వివాదం - ఘర్షణకు దారితీసి, కత్తితో దాడి వరకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామేశ్వర్ శివాజీ సఖరే అనే వ్యక్తి నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్లో, గత నాలుగు సంవత్సరాలుగా - పార్థమేశ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. తేదీ 23.05.2026న ఉదయం సుమారు 09.30 గంటల సమయంలో షాప్లో ఒక కస్టమర్ టిఫిన్ - తీసుకునేందుకు వచ్చాడు.

ఈ క్రమంలో అదనపు చట్నీ విషయంలో పార్థమేశ్తో కస్టమర్కు వాగ్వాదం చోటుచేసుకుంది. మాటలతో మొదలైన గొడవ శారీరక దాడికి దారితీయగా, కస్టమర్ పార్ధమేక చేయి చేసుకున్నాడు. వివాదాన్ని అదుపులోకి తెచ్చేందుకు షాప్ యజమాని ఇద్దరినీ సముదాయించి పరిస్థితిని సద్దుమణిగేలా ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా, పక్కనే ఉన్న ఉల్లిపాయలు, కూరగాయలు కోసే కత్తిని తీసుకుని పార్ధమేక దాడికి యత్నించాడు.

మధ్యలో యజమాని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతనిపైనా కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తిని గోషామహల్ హరీష్ గా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై టిఫిన్ సెంటర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story