Badvel: బద్వేల్‌లో రోడ్డెక్కిన వామపక్షాలు.. ధరల పెంపుపై నిప్పులు చెరిగిన సిపిఐ!

Badvel: బద్వేల్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల నిరసన. బయనపల్లె వద్ద రాస్తారోకో నిర్వహించిన సిపిఐ మరియు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 9 Jun 2026 2:02 PM IST
Badvel
X

Badvel: బద్వేల్‌లో రోడ్డెక్కిన వామపక్షాలు.. ధరల పెంపుపై నిప్పులు చెరిగిన సిపిఐ!

Badvel: రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యవసర ధరలను తగ్గించాలని రాష్ట్ర రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు బద్వేల్ రూరల్ ప్రాంతమైన సిద్ధవటం రోడ్డులోని బయనపల్లె గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు మరియు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.

నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలన కాలంలో పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచడమే కానీ ఈ 12 సంవత్సరాలలో ఏ ఒక్కసారి కూడా వీటి ధరలు తగ్గించిన పాపాన పోలేదని వీటికి తోడుగా ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బిజెపి పార్టీపై ఒత్తిడి తెచ్చి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల అదుపుకునకు సహకరించటం పోయి మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్లు సామాన్యుడు పని లేక పూటగడవడం కష్టంగా ఉన్న రోజుల్లో ఇలా అన్నిటిపై రేట్లను పెంచి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఇటువంటి చర్యలు అరికట్టకపోతే భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ మరియు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల స్థితిగతులను ఆలోచించాలని రాస్తారోకోను ఉద్దేశించి సిపిఐ నాయకుడు ఇమ్మానుయేల్ అన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story