Kadapa: కడప జిల్లా బీజేపీ నేతకు కీలక పదవి

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది, సీనియర్ బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులను విజయవాడ జోన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా.

P. GURUSWAMI, PRODDUTUR
Updated on: 24 May 2026 9:05 PM IST
Kadapa
X

Kadapa: కడప జిల్లా బీజేపీ నేతకు కీలక పదవి

Kadapa: కడప జిల్లా బిజెపి నేతకు కీలక పదవి లభించింది. ప్రొద్దుటూరు కు చెందిన ప్రముఖ న్యాయవాది సీనియర్ బిజెపి నేత గొర్రె శ్రీనివాసులను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిషనర్ గా నియమించింది. ఈ మేరకు ఆయన బెంగుళూరులో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ డివిజనల్ జోన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిషనర్ గా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఐఆర్డీ ( FEDERATION OF INDUSTRIES RESEARCH AND DEVELOPMENT) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్ద వైస్ ప్రెసిడెంట్ అయానుల్లాఖాన్, సౌత్ ఇండియా చైర్మన్ అరవింద్ గోవిందప్పల చేతుల మీదుగా ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఎపిలో విజయవాడ జోన్ కేంద్రంగా శ్రీనివాసులు ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చి పెట్టుబడులు పెట్టే వారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, కాలయాపన జరగడం వాటికి పరిష్కారమార్గంగా కేంద్రం ఈ సంస్థ ద్వారా సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. Msme కింద పరిశ్రమలు ఏర్పాటు చేసే వారితో పాటు జాతీయ, అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ సంస్థ సహకారాన్ని అందించి త్వరితగతిన పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసేలా కృషి చేస్తుంది.

అంతే కాకుండా సబ్సిడీ కింద పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి సబ్సిడీ కూడా త్వరితగతిన ఇచ్చేలా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఎపిని మూడు జోన్ లుగా విభజించి, విజయవాడ జోన్ కు కమిషనర్ గా శ్రీనివాసులు ను నియమించింది. ఈ జోన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కేటాయించారు. ఈ నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం కమిషనర్ గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంతకాలంగా నేను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవిని అప్పగించారని, ఈ పదవి ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ పదవి ద్వారా పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం తనను నియమించిందని, పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story