Rayachoti: డ్రగ్ టెస్టులో దొరికిపోయిన యువకుడు.. రాయచోటిలో పోలీసుల యాక్షన్!

Rayachoti: రాయచోటి పట్టణంలో మత్తు పదార్థాల వినియోగంపై పోలీసుల ప్రత్యేక నిఘా.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 9 Jun 2026 7:59 AM IST
Rayachoti
X

Rayachoti: డ్రగ్ టెస్టులో దొరికిపోయిన యువకుడు.. రాయచోటిలో పోలీసుల యాక్షన్!

Rayachoti: రాయచోటి పట్టణంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా మరియు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కటిక నోహిద్ (20), తండ్రి ఫయాజుద్దీన్, నివాసం ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, రాయచోటి పట్టణం, అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని రాపిడ్ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు.

ప్రభుత్వం అందజేసిన డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షించగా గంజాయి వినియోగం చేసినట్లు పాజిటివ్ ఫలితం రావడంతో అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ బి.వి. చలపతి గారు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గంజాయి, మత్తు మాత్రలు లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ బి.వి. చలపతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్సైలు శ్రీ విష్ణువర్ధన్ గారు, శ్రీ మహమ్మద్ జహీర్ గారు, పోలీసు సిబ్బంది మరియు EAGLE టీం సభ్యులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story