Razole: రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం - కాలువల అభివృద్ధితో రైతులకు భరోసా

Razole: రాజోలు నియోజకవర్గంలోని విశ్వేశ్వరాయపురం, లక్కవరం బ్రాంచి కాలువల పూడికతీత పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు.

PRABHU, RAZOLE
Published on: 27 May 2026 3:22 PM IST
Razole
X

Razole: రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం - కాలువల అభివృద్ధితో రైతులకు భరోసా

Razole: రాజోలు నియోజకవర్గం లోని విశ్వేశ్వరాయపురం మరియు లక్కవరం బ్రాంచి కాలువలలో జరుగుతున్న పూడికతీత పనులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువల పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సజావుగా సాగి, వ్యవసాయ భూములకు సమయానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కాలువల అభివృద్ధి పనులను చేపడుతోందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన సాగునీటి సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story