Razole: పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మాతృవియోగం

Razole: పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మానేపల్లి అయ్యాజీ వేమా తల్లి మానేపల్లి ద్రౌపతి (96) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు.

PRABHU, RAZOLE
Published on: 24 May 2026 3:32 PM IST
Razole
X

Razole: పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మాతృవియోగం

Razole: పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా తల్లి మానేపల్లి ద్రౌపతి (96) వృద్దాప్య సమస్యలు, అనారోగ్యంతో ఈనెల 17 ఆదివారం రోజున రాజోలు లోని తన స్వగృహంలో కన్నుమూశారు. రాజోలు మండలం లోని సోంపల్లి గ్రామంలోని కైలాస భూమిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.ఆమె మరణం పట్ల రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలతో పాటు కూటమి ముఖ్య నేతలు సందర్శించి నివాళులర్పించారు.ఈరోజు నర్సాపురం కి చెందిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాజోలు లోని వేమా నివాసానికి చేరుకుని వేమా ని పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీ.వి.ఎన్.మాధవ్ కూడా వేమా నివాసానికి చేరుకుని పరామర్శించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story