Boyinpalli: సిరిసిల్ల కాంగ్రెస్‌లో కొత్త జోష్.. సువీన్ యాదవ్‌కు ఊహించని సన్మానం!
Boyinpalli: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో నూతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్‌కు ఘన సన్మానం జరిగింది.
Boyinpalli: సిరిసిల్ల కాంగ్రెస్‌లో కొత్త జోష్.. సువీన్ యాదవ్‌కు ఊహించని సన్మానం!
రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ కు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. గ్రామ సీనియర్ నాయకులు వెంకట రామరావు ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కొదురుపాక గ్రామ ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు మరియు రజక సంఘం సభ్యులు, స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా మండల పగ్గాలు చేపట్టిన సువీన్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షల వెల్లువ కురిపించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యావంతుడు, నిబద్ధత కలిగిన యువ నాయకుడు సువీన్ యాదవ్ నేతృత్వంలో బోయినిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సువీన్ యాదవ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.




