Karimnagar: కరీంనగర్‌లో ప్రజా సమస్యలపై సీపీఎం సమరశంఖం
Karimnagar: కరీంనగర్ నగరంలో వీధి కుక్కల బెడద, తాగునీటి కొరత, డంప్ యార్డ్ తరలింపు, రైల్వే బ్రిడ్జి పనుల జాప్యంపై సిపిఎం నగర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Karimnagar: కరీంనగర్‌లో ప్రజా సమస్యలపై సీపీఎం సమరశంఖం
Karimnagar: స్థానిక కోతి రాంపూర్ లో గల ముకుంద లాల్ మిశ్రా భవన్ లో సిపిఎం నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నగరంలో వీధి కుక్కలు కోతుల బెడద తీవ్రంగా ఉందని, సుభాష్ నగర్, గాంధీ రోడ్, భగత్ నగర్ సప్తగిరి కాలనీ,అంబేద్కర్ నగర్, సాయి నగర్, కలెక్టరేట్ రోడ్, తదితర ప్రాంతాలలో వీధి కుక్కలు చిన్నపిల్లల్ని కరుస్తూ మోటార్ వెహికల్ పై వెళుతున్న వారిని వెంబడించి గాయాలు చేస్తున్నాయని అన్నారు.
సుప్రీంకోర్టు సైతం వీధి కుక్కలను నివారించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కరీంనగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతుందని అన్నారు. నిర్దిష్టమైన సమయంలో మంచినీటి సరఫరా చేయాలి.. పక్కనే లోయర్ మానేరు డ్యాం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు నీటి కొరత ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజువారీగా నీటి సరఫరా చేయాలని, డివిజన్ ప్రజలకు తెలిసే విధంగా నిర్దిష్టమైన సమయంలో మంచినీటి సరఫరా చేయాలని అన్నారు.
డంపు యాడ్ సమస్య పరిష్కారం ఎప్పుడు..
నగరంలో ప్రధానంగా డంపు యాడ్ సమస్య ఉందని, మేయర్ పీఠం సమక ఇస్తే నెల రోజుల్లో తరలిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని అన్నారు.
నత్తనడకన సాగుతున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు..
రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు సంవత్సరాల కాలంగా నత్తనడకన సాగుతున్నాయని, రైల్వే గేటు పడడం మూలంగా అంబులెన్స్లు సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుని పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి పోరాటాలను చేస్తాం..
నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం ప్రజా సమస్యలపై దృష్టి సారించి నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య, పున్నం రవి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.




