Gangadhara: వెంకటాయపల్లిలో అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం నూతన పాలకవర్గాన్ని గ్రామ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 24 May 2026 12:15 PM IST
Gangadhara
X

Gangadhara: వెంకటాయపల్లిలో అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం!

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలోని వెంకటాయపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం నూతన పాలకవర్గాన్ని గ్రామ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధి, గ్రామ యువతకు సేవలు, సామాజిక కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు.

నూతన కమిటీలో అధ్యక్షుడిగా కల్లేపెల్లి కృష్ణ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా కొత్తూరు అనిల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా కల్లేపెల్లి గంగస్వామి, సంయుక్త కార్యదర్శిగా గుండు మహేష్ ఎన్నికయ్యారు.

కోశాధికారులుగా ఉండేటి రమేష్, గాలిపెల్లి మహేష్ ఎంపిక కాగా, ప్రచార కార్యదర్శులుగా కల్లేపెల్లి ప్రదీప్, గుండు మహేష్, కల్లేపెల్లి అక్షయ్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా కల్లేపెల్లి మల్లేశం, కల్లేపెల్లి మల్లయ్య బాధ్యతలు చేపట్టగా, గౌరవ అధ్యక్షులుగా కల్లేపెల్లి మహేష్, కల్లేపెల్లి గంగసాగర్ ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను గ్రామ పెద్దలు, యువకులు అభినందించారు. సంఘం ద్వారా గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story