Jammikunta: వృద్ధుడి మరణానంతరం నేత్రదానం.. ఇద్దరికి చూపు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన రావికంటి రాజయ్య (80) వృద్ధాప్యంతో మృతి చెందారు.

GANESH, JAMMIKUNTA
Published on: 24 May 2026 8:39 PM IST
Jammikunta
X

Jammikunta: వృద్ధుడి మరణానంతరం నేత్రదానం.. ఇద్దరికి చూపు!

Jammikunta: కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణం లోని కొండూరి కాంప్లెక్స్ నివాసి అయిన రావి కంటి రాజయ్య (80) వృద్ధాప్యంతో మృతి చెందడంజరిగింది. గర్రెపల్లి వెంకటేశ్వర్లు, సమాచారము మేరకు సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి. డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు నేత్రదానంపై అవగాహన కల్పించగా, కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో, వరంగల్ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్technician నరేందర్ సహకారంతో నేత్రాలను సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ఐ బ్యాంక్ కు పంపడం జరిగింది. కీర్తిశేషులు, రావికంటి రాజయ్య నేత్ర దానంతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు-కోడల్లు రావి కంటి నీలకంఠం-శ్రీలత, వెంకటేశ్వర్లు-నీరజ.

సహకరించిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిటి కేసి శివానందయ్య , ముత్యాల జగదీశ్వర్, చిదురాల శ్రీనివాస్, వంగల రమేష్ సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, లగిశెట్టి చంద్రమౌళి, మరియు బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story