Karimnagar: బడిబాట పడదాం.. భవిష్యత్తుకు బాటలు వేద్దాం: కలెక్టర్ చిత్రా మిశ్రా!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో 'బడిబాట' ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా.
Karimnagar: బడిబాట పడదాం.. భవిష్యత్తుకు బాటలు వేద్దాం: కలెక్టర్ చిత్రా మిశ్రా!
కరీంనగర్ : జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతి చిన్నారి పాఠశాల బాట పట్టాలని, ప్రతి గ్రామం విద్యా వికాసానికి నిలయంగా మారాలని సంకల్పంతో రూపొందించిన "బడిబాట" ప్రచార గీతాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా. అశ్విని తనాజీ వాకడే పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రశాంత్ రెడ్డి గీతాన్ని కలెక్టర్ కి సమర్పించారు.
ఈ గీతం కేవలం ఒక పాట కాదు ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ఒక విద్యా ఉద్యమం. ప్రతి బాలబాలికను బడిలో చేర్పించి, నాణ్యమైన విద్య అందించాలనే సందేశాన్ని ఈ గీతం హృదయాలకు చేరవేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా అశోక్ రెడ్డి , శ్రీనివాస్ వ్యవహరించారు. జడ్పీహెచ్‌ఎస్ ఒద్యారం పాఠశాలకు చెందిన పదవీ విరమణ పొందిన మాజీ మండల విద్యాధికారి ఎనుగు ప్రభాకర్ రావు కె.బి. శర్మ గేయ రచయిత వెంకటేశ్వర్లు కృషితో ఈ గీతం రూపొందించబడింది.
"ప్రతి ఇంటి నుండి ఒక అడుగు బడివైపు.. ప్రతి గ్రామం నుండి ఒక అడుగు విద్యావైపు.." అనే సందేశంతో రూపొందిన ఈ గీతం జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి స్ఫూర్తినిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడంలో కీలక పాత్ర పోషించనుందన్నారు.
"విద్యే శక్తి. విద్యే భవిష్యత్తు. బడిబాటే ఆ భవిష్యత్తుకు బంగారు బాట" అనే సందేశంతో జిల్లాలోని తల్లిదండ్రులు, ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి, తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని విద్యాశాఖ పిలుపునిచ్చింది.




