Karimnagar: ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి సభ. స్వశక్తి మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 9 Jun 2026 11:18 AM IST
Karimnagar
X

Karimnagar: ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ : సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా స్వశక్తి మహిళా సంఘాలకు 553 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్న నేపథ్యంలో సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కరీంనగర్ జిల్లాకు కేటాయించిన 16 బస్సులను మహిళా సంఘాలకు సీఎం అందించనున్నట్లు తెలిపారు.

ప్రతి మండల సమాఖ్య నుంచి 50 మంది స్వశక్తి మహిళా సంఘ సభ్యులు సభకు హాజరయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళల ప్రయాణం, భోజనం, ఇతర సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తనాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీఓ గీత, అదనపు డీఆర్‌డీఓ రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్, ఆర్టీసీ డిపో మేనేజర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story