Sircilla: సిరిసిల్ల మిడ్ మానేరు తాజా అప్‌డేట్.. డ్యామ్‌లో నీరు ఎంత ఉందంటే?

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్ తాజా నీటి మట్టం వివరాలను అధికారులు విడుదల చేశారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 24 May 2026 12:48 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల మిడ్ మానేరు తాజా అప్‌డేట్.. డ్యామ్‌లో నీరు ఎంత ఉందంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు లో ఉదయం 06:00 గంటల సమయానికి నీటి మట్టం 307.22 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 7.636 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లోలు లేవని అధికారులు తెలిపారు. ఎస్‌వైపీ (జీపీఎచ్), ఎస్‌ఆర్‌ఎస్‌పీ, అలాగే మానేరు, ములవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీటి ప్రవాహం నమోదు కాలేదు.

ఇక రిజర్వాయర్ నుంచి మొత్తం 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరీభవనం ద్వారా 95 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. రైట్ సైడ్, రైట్ గేట్, ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, ప్యాకేజ్-9, ప్యాకేజ్-10, జీసీఎల్‌ఎస్ మార్గాల్లో ఎలాంటి నీటి విడుదల లేదు. ప్రస్తుతం రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు మరియు రైట్ సైడ్ గేట్లు ఏవీ ఎత్తివేయలేదని అధికారులు వెల్లడించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story