Thimmapur: చేతులు కట్టేసి చెట్టుకు ఉరివేసిన స్థితిలో యువకుడి శవం!

Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో దారుణం జరిగింది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 24 May 2026 12:08 PM IST
Thimmapur
X

Thimmapur: చేతులు కట్టేసి చెట్టుకు ఉరివేసిన స్థితిలో యువకుడి శవం!

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా అనుమానాస్పదంగా యువకుడి మృతి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. చేతులు తాడుతో కట్టి చెట్టుకు ఉరి వేసి యువకుడి మృతదేహం వేలాడదీసి ఉన్నది.

సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధ్ (22) గా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎల్ఎండి చిగురుమామిడి ఎస్సైలు సయ్యద్ అన్వర్, పృథ్వి గౌడ్ తో పాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో దర్యాప్తు చేపట్టారు.‌ అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఇటీవలే కరీంనగర్ లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఘటన స్థలంలో 3 బీర్ బాటిల్స్ లభ్యం కావడంతో వాటిని, సెల్ ఫోను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీనిద్ ను ఎవరో ఉరి వేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story