Singareni: కార్మిక నేత యూనియన్ కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని
Singareni: సింగరేణి కార్మికుల 30 డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీసు అందజేసిన ఏఐటీయూసీ.
Singareni: కార్మిక నేత యూనియన్ కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని
Singareni: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక నేత యూనియన్ కొమరయ్య కాంస్య విగ్రహాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కోల్బెల్ట్ యూనియన్ నాయకులు, మేయర్ గణేష్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు.. మంత్రులు, ముఖ్యమంత్రులు సింగరేణియుల జీవితాలతో ఆడుకునే వాళ్ళు ఎవరైనా నాకు శత్రువులే అన్నారు. సింగరేణి కార్మికుల పేరుతో పోరాట స్ఫూర్తిని నేర్చుకున్నాను.. వారి మద్దతు సహకారంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను.
కార్మికుల మెడికల్ ఇన్వాల్వ్మెంట్, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని లేకుంటే సమ్మెకు దిగుతామని కార్మికుల పేరు మార్పిడి, సొంతింటి కల, డిస్మిస్ కార్మికుల సమస్యలు అన్ని తీర్చగలిగిన సమస్యలని అవి వెంటనే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నా కాని వివక్షత చూపుతున్న యాజమాన్య ఆటలు ఇక సాగవ్ -ఇక ఉపేక్షించేది లేదు, పోరాటానికి సిద్ధం,,, హెచ్చరించిన సెంట్రల్ కౌన్సిల్, ఏఐటీయూసీ.
యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం విజయవంతం. హెడ్ ఆఫీస్ ముందు కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ.
కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం రెండో రోజు ఘనంగా నిర్వహించబడింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు, ఎఐటియుసి గౌరధ్యక్షులు కూనంనేని సాంబశివరావు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నాయకులు తమ ప్రసంగాలలో సింగరేణిలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఇటీవల గోలేటి నుండి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్త, కార్మికునికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు, సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించి, ఈ క్రింది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిల విడుదల, అదేవిధంగా కొత్త గనుల ప్రారంభం,మెడికల్ బోర్డు నిర్వహణ,2025-2026 లాభాల వాటాల్లో 40 % వాటా చెల్లించాలి,మారుపేర్లు – విజిలెన్స్ కేసుల పరిష్కారం,సొంత ఇంటి పథకం అమలు, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం యాజమాన్యమే భరించడం,క్లర్క్ పోస్టుల భర్తీ, మరియు ఇతర పెండింగ్లో ఉన్న డిపార్ట్మెంట్ల పోస్టుల వెంటనే భర్తీ చేయాలి, 400 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ,సహజ మరణం పొందిన కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా.
ఓవర్నెన్లు ప్రమోషన్లు ..
దాదాపు 30 డిమాండ్ల సాధన కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సోమవారం సాయంత్రం సింగరేణి యాజమాన్యానికి అధికారికంగా సమ్మె నోటీసు అందజేసిందని నాయకులు ప్రకటించారు.
కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం మరియు ఉద్యోగ భద్రత పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవం..
అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మనుబోతుల కొమురయ్య గారి కాంస్య విగ్రహ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ,ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పునఃప్రారంభోత్సవ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు కొమురయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సింగరేణి కార్మిక ఉద్యమాల అభ్యున్నతికి, కార్మిక హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. కొమురయ్య గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని కార్మిక సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి SK.సాబీర్ పాషా,కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,మిర్యాల రంగయ్య, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగ వెంకట్, వీరస్వామి, అన్ని ఏరియాల బ్రాంచ్ కార్యదర్శులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు,కొమరయ్య కుటుంబ సభ్యులు,టౌన్ పార్టీ కార్యదర్శి జమలయ్య,కొత్తగూడెం కార్పొరేటర్లు, పార్టీ నాయకులు,మరియు కొమరయ్య గారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.




