Srisailam: శ్రీశైలంలో భక్తుడి భక్తి.. స్వామి వారికి వెండి నాగాభరణం సమర్పణ!
Srisailam: శ్రీశైలం క్షేత్రంలో భక్తుడి కానుక. మల్లికార్జున స్వామి వారికి 540 గ్రాముల వెండి నాగాభరణాన్ని సమర్పించిన కొంపల్లికి చెందిన భక్తుడు బచ్చు శివశంకర్ రెడ్డి.
Srisailam: శ్రీశైలంలో భక్తుడి భక్తి.. స్వామి వారికి వెండి నాగాభరణం సమర్పణ!
Srisailam: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబ దేవి సమేత మల్లికార్జున స్వామి వారికి బచ్చు శివశంకర్‌రెడ్డి, కొంపల్లె, మెడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా కు చెందిన అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానమునకు సోమవారం సమర్పించారు.
ఈ వెండి నాగాభరణం బరువు 540 గ్రాములు. ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపములో దాతలు అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా శ్రీమతి సావిత్రిలకు అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు.
Next Story




