గిద్దలూరులో వైసీపీ రౌండ్ టేబుల్: కూటమి రెండేళ్ల పాలనపై కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిరసన స్వరం!

Giddalur: ప్రకాశం (మార్కాపురం) జిల్లా గిద్దలూరులో వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 9 Jun 2026 8:22 PM IST
గిద్దలూరులో వైసీపీ రౌండ్ టేబుల్: కూటమి రెండేళ్ల పాలనపై కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిరసన స్వరం!
X

మార్కాపురం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని భాస్కర్ రెడ్డి కల్యాణ మండపంలో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రెండేళ్ల కూటమిపాలనలో ప్రజలు సంతోషంగా లేరని వైసిపి నాయకులు అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోని అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న హయంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడంపై వారు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో పేదలు ఎవరు ఆనందంగా లేరని 2029 ఎన్నికలలో మరో మారు జగనన్నను గెలిపించుకునే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story