Srisailam: శ్రీశైలంలో భక్తుల సందడి.. దర్శనానికి 5 గంటల నిరీక్షణ!

Srisailam: శ్రీశైలంలో భక్తుల రద్దీ. స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం. సెలవుల నేపథ్యంలో భారీగా తరలివస్తున్న భక్తులు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 9 Jun 2026 7:55 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో భక్తుల సందడి.. దర్శనానికి 5 గంటల నిరీక్షణ!

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది వేసవి సెలవులు ముగింపు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ముందుగానే ఆన్లైన్లో స్పర్శ( బ్రేక్ ) దర్శనం టికెట్స్ పొందిన భక్తులకు మాత్రమే యధావిధిగా స్పర్శ దర్శనానికి మాత్రమే కొనసాగింపు భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు.

శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు,సామాన్య భక్తులకు ఉచిత,శీఘ్ర,అతిశీఘ్ర, దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

ఆన్లైన్లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమే( బ్రేక్ ) స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు,భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story