Markapuram: యోగాతో ఆరోగ్యవంతులుగా మహిళలు.. మార్కాపురం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం!

Markapuram: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహిళల కోసం ప్రత్యేక యోగా కార్యక్రమం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 Jun 2026 1:53 PM IST
Markapuram
X

Markapuram: యోగాతో ఆరోగ్యవంతులుగా మహిళలు.. మార్కాపురం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం!

మార్కాపురం జిల్లా: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం 5:30 గంటలకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి గోలమారి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం పూర్తిగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినందున, పట్టణం మరియు పరిసర ప్రాంతాల మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యోగా సాధనలో భాగస్వాములు కావాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story