Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Srisailam: శ్రీశైల క్షేత్రంలో నిత్య కళారాధనలో భాగంగా అద్భుతమైన భజన కార్యక్రమం. కొలిమిగుండ్లకు చెందిన ఉమామహేశ్వర భజన మండలి ప్రదర్శన.
Srisailam: శ్రీశైలంలో భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Srisailam: శ్రీశైల దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) సోమవారం ఉమామహేశ్వర భజన మండలి, కొలిమిగుండ్ల, నంద్యాల జిల్లా వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమములో గణపతి ప్రార్థన, శివశివశంకకరా, హరహరమహదేవ, పార్వతీ పరమేశ్వరా, శంభోశంభో, లింగాష్టకం, ఓంకార రూపిణి, శంకర శివా, పార్వతీతనయా, శివుడే దైవము, పరమేశ్వరీ జగదీశ్వరి మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను మొదలైన వాటిని శివరామిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రామస్వామి, రామకృష్ణారెడ్డి, పెద్దయ్య, రాజు, చిన్నయ్య, రామలక్ష్మిరెడ్డి, కిరణ్, రామరావు తదితరులు ఆలపించారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయిని శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.




