Medak: మాఫ్టీలో తిరుగుతూ చెక్‌పోస్టులు తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

Medak: మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాఫ్టీలో, ప్రైవేట్ వాహనంలో తిరుగుతూ జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, బక్రీద్ ప్రత్యేక చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు.

NAGARAJ, MEDAK
Published on: 24 May 2026 8:55 PM IST
Medak
X

Medak: మాఫ్టీలో తిరుగుతూ చెక్‌పోస్టులు తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

మెదక్: మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాఫ్టీలో, ప్రైవేట్ వాహనంలో తిరుగుతూ పోలీసు స్టేషన్లు, బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తూప్రాన్ టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని అదనపు ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధృవపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు.

తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్లలో నమోదు చేసి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అక్రమ రవాణా లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది ట్రాఫిక్ బ్యాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story