Narsapur: నర్సాపూర్‌లో కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభం
Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ప్రజలు వివిధ రకాల ప్రభుత్వ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ సూచించారు.
Narsapur: నర్సాపూర్‌లో కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభం
నర్సాపూర్: అర్హత కలిగిన నర్సాపూర్ మున్సిపల్ ప్రజలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉండి పెన్షన్ తీసుకునే అర్హతలు కలిగిన వారు వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతు, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ మరియు కల్లుగీత కార్మికుల పెన్షన్ల కొరకు సంబంధిత ధ్రువపత్రాలు మరియు ఇతర వివరాలతో పురపాలక సంఘం కార్యాలయం నందు, కార్యాలయం పనివేళల్లో దరఖాస్తు చేసుకోగలరని వెల్లడించారు. ఈ పెన్షన్ అర్హతల వివరాలు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి.గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Next Story




