భోలా బాలయ్య’ సిగ్నేచర్ సాంగ్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫ్యాన్స్!
Nandamuri Balakrishna: అనంతపురం జిల్లా గుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలపై వై. నైరుతి రెడ్డి నేతృత్వంలో ఫొటో ఎగ్జిబిషన్, నల్ల బెలూన్ల ఎగురవేత.
Nandamuri Balakrishna: నటసింహం, నందమూరి బాలకృష్ణ జూన్ 10న తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా హంగామా మొదలుపెట్టారు. బాలయ్య బాబు పుట్టినరోజు కానుకగా ఎన్‌బీకే హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకుడు, సుదీర్ఘకాలంగా బాలకృష్ణకు అత్యంత ఆప్తుడిగా ఉన్న అనంతపురం జగన్ ఒక అద్భుతమైన ట్రిబ్యూట్ వీడియో సాంగ్‌ను సిద్ధం చేశారు. ‘భోలా బాలయ్య’ (Bhola Balayya) అనే టైటిల్‌తో రూపొందిన ఈ ప్రత్యేక గీతాన్ని ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా విడుదల చేశారు.
బోయపాటి శ్రీను చేతుల మీదుగా లాంచ్.. విజువల్స్ అద్భుతం!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘భోలా బాలయ్య’ స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జగన్ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.
"బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి నేను ఇప్పటికే నా సినిమాల ద్వారా చూపించాను. అయితే ఈ స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే, ఇందులో చూపించిన విజువల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. బాలయ్య బాబు చిన్ననాటి ఫోటోల నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రస్థానాన్ని ఈ పాటలో చాలా చక్కగా చూపించారు. పాట కంటే కూడా ఆ విజువల్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి" అని బోయపాటి శ్రీను కొనియాడారు.
బాలయ్య పుట్టినరోజు అనేది ఏ క్యాలెండర్‌లోనో ఉండే తేదీ కాదని, అది అభిమానుల గుండెల్లో ఉండే ఒక పెద్ద పండగ అని బోయపాటి వ్యాఖ్యానించారు. బాలకృష్ణ సామాజిక సేవలను స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
దేవీ నవరాత్రుల్లా 10 రోజుల పాటు బాలయ్య జాతర!
ఈ కార్యక్రమంలో అనంతపురం జగన్ మాట్లాడుతూ బాలకృష్ణ కేవలం ఒక హీరో మాత్రమే కాదని, ఆయనొక అద్భుతమైన శక్తి అని అభివర్ణించారు. దేవీ నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటామో, బాలయ్య బాబు పుట్టినరోజును జూన్ 1 నుండి జూన్ 10 వరకు తామంతా అలాగే ఒక పండగలా జరుపుకుంటామని జగన్ తెలిపారు.
బాలయ్య రోజుకు దాదాపు ఇరవై గంటల పాటు వివిధ రంగాలలో శ్రమిస్తారని, అంతటి నిస్వార్థపరుడు, భోళా మనుషి కాబట్టే ఈ పాటకు ‘భోలా బాలయ్య’ అనే పేరు పెట్టామని స్పష్టం చేశారు. తన తండ్రి మరణం తర్వాత బాలకృష్ణ తనకు తండ్రిలాంటి స్థానాన్ని ఇచ్చారని జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ క్రేజీ స్పెషల్ సాంగ్‌కు ఈశ్వర్ దత్తు సంగీతం అందించగా, దివాకర్ అమిలినేని సాహిత్యం (లిరిక్స్) అందించారు. కరీముల్లా, రుచేరా వైద్య, ఎస్ఎమ్ అఫ్సర్ ఈ పాటను ఆలపించారు. శివాజీ వి దర్శకత్వంలో రూపొందిన ఈ వీడియో సాంగ్‌కు పవన్ రాచర్ల కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.




