లవ్ అండ్ రివెంజ్ డ్రామా ‘జంగా’.. స్పెషల్ పోస్టర్‌తో షాకిచ్చిన హీరో త్రిగుణ్!

Jangaa: ఇటీవలే ‘ఈష’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో త్రిగుణ్ సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Srinivas Rao
Published on: 9 Jun 2026 10:33 AM IST
Jangaa
X

లవ్ అండ్ రివెంజ్ డ్రామా ‘జంగా’.. స్పెషల్ పోస్టర్‌తో షాకిచ్చిన హీరో త్రిగుణ్!

Jangaa: ఇటీవలే ‘ఈష’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో త్రిగుణ్ సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘జంగా’ . తాజాగా త్రిగుణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. చిత్రంలోని త్రిగుణ్ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు లవ్లీ, సాఫ్ట్ క్యారెక్టర్లలో కనిపించిన ఈ యంగ్ హీరో... ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా కంప్లీట్ మాస్ అండ్ రగ్గడ్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘శివుడు మేల్కొన్నాడు’.. ఆకట్టుకుంటున్న టైటిల్ టాగ్ లైన్!

ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ గడ్డం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. ప్రస్తుతం ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రిగుణ్ బర్త్‌డే ట్రీట్‌గా వచ్చిన మోషన్ పోస్టర్ సినిమా ప్రపంచం ఎంత ఇంటెన్సివ్‌గా ఉండబోతోందో హింట్ ఇచ్చింది.

ఈ సినిమా టైటిల్ లోగో పక్కనే ఉంచిన ‘త్రిశూలం’ ఆయుధం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా “వెన్ లవ్ బర్న్స్.. శివ అవేకన్స్” (When Love Burns, Shiva Awakens) అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రేమ, పగ , దైవిక ఆగ్రహం నేపథ్యంలో ఈ కథ సాగనుందని ఈ ట్యాగ్‌లైన్ స్పష్టం చేస్తోంది.

వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో..

భారీ సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన పక్కా యాక్షన్ డ్రామాగా ‘జంగా’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా చాలా బలంగా ఉంది.

ఈ చిత్రంలో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ కథానాయికగా నటిస్తోంది. విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఒక అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెరవనున్నారు.శ్రవణ్ రాఘవేంద్ర, మధు నందన్, గగన్ విహారి, చందు గౌడ్ , ‘జబర్దస్త్’ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మోషన్ పోస్టర్‌లో చూపించిన విజువల్స్, నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, త్రిగుణ్ రగ్గడ్ మేకోవర్ చూస్తుంటే ఈ సినిమాతో ఆయన ఖాతాలో మరో మాస్ హిట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story