బాలకృష్ణ సినిమాలో విలన్‌గా ఆ సీనియర్ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ సినిమాలో విలన్‌గా ఆ సీనియర్ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ స్క్రిప్ట్ వండుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
బాలయ్యతో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఢీ.. పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్!
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రతినాయకుడి (విలన్) పాత్ర కోసం దర్శకుడు కొరటాల శివ ఒక ఊహించని పేరును తెరపైకి తెచ్చారు. సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‌గా నటించబోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మూవీ టీమ్ ఆయనను సంప్రదించగా, కథలోని పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ నచ్చి రాజశేఖర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వెండితెరపై బాలయ్య - రాజశేఖర్ తలపడితే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఈ ఇద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట.
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య.. ఆగస్టు నుండి షూటింగ్!
ఈ సినిమాలో బాలకృష్ణ లుక్, మేకోవర్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం.
ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య పాత్ర పూర్తిస్థాయి మాఫియా నేపథ్యంలో, ఊరమాస్ అవతార్‌లో సాగుతుందని టాక్. కొరటాల శివ మార్క్ కమర్షియల్ విలువలకి తోడు, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బలంగా ఉండబోతున్నాయట.
ఈ భారీ యాక్షన్ డ్రామాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సుధాకర్ చెరుకూరి (శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్) , సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.




