Nalgonda: నిలిచిన బిల్లులు చెల్లించాలి: 'చలో హైదరాబాద్' వాల్ పోస్టర్ విడుదల
Nalgonda: పెండింగ్ బిల్లుల విడుదల కోసం నల్లగొండ జిల్లా కాంట్రాక్టర్ల ఆందోళన.
Nalgonda: నిలిచిన బిల్లులు చెల్లించాలి: 'చలో హైదరాబాద్' వాల్ పోస్టర్ విడుదల
నల్లగొండ జిల్లా: ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు ప్రకటించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను అసోసియేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని, వడ్డీల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.




