Nalgonda: నల్లగొండ కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల వార్.. మంత్రి ఫొటో లేకపోవడంతో రచ్చ!
Nalgonda: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు. డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత ఫ్లెక్సీల వివాదం.
Nalgonda: నల్లగొండ కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల వార్.. మంత్రి ఫొటో లేకపోవడంతో రచ్చ!
Nalgonda: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫొటోలు ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మంత్రి వర్గానికి, డీసీసీ అధ్యక్షుడి అనుచరులకు మధ్య ఉన్న విభేదాలే దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, పట్టణంలో ఏర్పాటు చేసిన సదరు ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చించివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత 'కోల్డ్ వార్' ఒక్కసారిగా బహిర్గతమైంది.
Next Story




