Nakrekal: నకిరేకల్‌లో ధాన్యం కొనుగోళ్లపై ఎంపీ, ఎమ్మెల్యే కీలక సమీక్ష
Nakrekal: నకిరేకల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కేతపల్లి, నకిరేకల్, కట్టంగూర్ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై భువనగిరి ఎంపీ, నకిరేకల్ ఎమ్మెల్యే అధికారులతో సమీక్షా సమావేశం
Nakrekal: నకిరేకల్‌లో ధాన్యం కొనుగోళ్లపై ఎంపీ, ఎమ్మెల్యే కీలక సమీక్ష
Nakrekal: నకిరేకల్ MRO కార్యాలయంలో కేతపల్లి, నకిరేకల్, కట్టంగూర్ మండలాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత గారు, మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల - మాధవ్ రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు మండలాల్లో, మొత్తం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికి 23 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీలోపు మిగిలిన అన్ని సెంటర్లలో వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.




