Nalgonda: నల్లగొండలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య!

Nalgonda: నల్లగొండలో దారుణ హత్య. మిర్యాలగూడ రోడ్డు శివారులో బండరాయితో మోది గుర్తుతెలియని వ్యక్తిని చంపిన దుండగులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Jun 2026 10:15 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య!

Nalgonda: నల్లగొండ పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. మిర్యాలగూడ రోడ్డు శివారులోని హ్యాపీ హోమ్స్ కాలనీ ఎదురుగా ఉన్న ఒక ఖాళీ వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అత్యంత పాశవికంగా బండరాయితో ముఖాన్ని బాది, గుర్తుపట్టలేనంతగా చిద్రం చేసి చంపేసినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. మృతుడు ఎవరు? హత్యకు గల కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story