Suryapet: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కీలక నిర్ణయం: రైతులకు మెరుగైన సేవలు.. మార్కెట్ కార్మికులకు ఇకపై ‘యూనిఫాం’!
Suryapet: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.
Suryapet: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కీలక నిర్ణయం: రైతులకు మెరుగైన సేవలు.. మార్కెట్ కార్మికులకు ఇకపై ‘యూనిఫాం’!
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ అభివృద్ధి, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రానున్న సీజన్ ఏర్పాట్లపై డైరెక్టర్లతో విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, రానున్న సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం కమిటీ బాధ్యత అన్నారు. రైతుల సంక్షేమే ధ్యేయంగా మార్కెట్ కమిటీ పనిచేస్తుందని, మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గుర్తింపు, క్రమశిక్షణ పెంచేందుకు యూనిఫారాలు అందించాలని సభ్యులు నిర్ణయించారు. ఒకే విధమైన యూనిఫారాలు వల్ల నిర్వహణ సులభతరం అవడంతో పాటు వారి సేవలకు గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఉన్నత శ్రేణి కార్యదర్శి ఫసియోద్దీన్ ముక్రం, డైరెక్టర్లు ఆర్తి కేశవులు, చెన్నోజు నర్సింహాచారి, నకిరేకంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, షేక్ అబ్దుల్ కరీం, మాడ్గుల నవీన్, ఉప్పల సత్యనారాయణ, మెడిమేలపు దామోదర్ రెడ్డి, గోపగాని పెద్ద వెంకన్న, దాసరి తిరుమలరావు, గోగుల పద్మ సత్తిరెడ్డి, యూడీసీ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.




