Nellore: డీఎస్సీపై వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు మంత్రి నారాయణ కౌంటర్!
Nellore: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రంగా ఖండించారు.
Nellore: డీఎస్సీపై వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు మంత్రి నారాయణ కౌంటర్!
Nellore: వైఎస్ఆర్సీపీ పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేసిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సీఎం చంద్రబాబు పరిపాలనానుభవంతో పరిస్థితిని చక్కదిద్దుతుంటే వైసిపి చూసి ఓర్వలేకుందని, పారదర్శకంగా జరుగుతున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై అక్కసు వెళ్లగక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్య ఆరోపణలతో బురదచల్లే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రాన్ని విద్యావ్యవస్థలో మొదటిస్థానంలో నిలపాలన్నది యువనేత లోకేష్ ఆలోచన అని, లోకేష్ ఆలోచన మేరకే నెల్లూరు లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెప్పారు . విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశామని, మరో 14 స్కూల్స్ ని విఆర్సీ తరహాలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నగరంలో అన్నిస్కూల్స్ ని విఆర్సీకి దీటుగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన డీఎస్సీ ఎంపికలో అవకతవకలు జరిగాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలపై మంత్రి నారాయణ అకౌంట్ ఇచ్చారు. నెల్లూరు నగరంలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు.
పాలన చేతకాక అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుండగా చూసి ఓర్వలేక వైసీపీ అసత్యపు ఆరోపణలు చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. టిడిపి యువనేత మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ఇవాళ నెల్లూరు నగరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ తరహా మౌనిక సదుపాయాలను కలిగి ఉంటున్నాయని అందుకు తగిన ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు విద్యా వ్యవస్థలో చేస్తున్న మార్పులను జీర్ణించుకోలేని వైసిపి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.




