Nellore: గీత దాటితే వాతలు తప్పవు.. రౌడీషీటర్లకు ఎస్పీ అజితా వార్నింగ్!
Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు జిల్లా ఎస్పీ అజితా ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
Nellore: గీత దాటితే వాతలు తప్పవు.. రౌడీషీటర్లకు ఎస్పీ అజితా వార్నింగ్!
Nellore: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల నేర నియంత్రణ, శాంతి భద్రతలు నెలకొల్పే దిశగా నెల్లూరు జిల్లా పోలీసులు పావులు కదుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు నెల్లూరు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మహిళలు మరియు బాలికలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ కోసం, CC కెమెరాలు, బీట్ వ్యవస్థ, రౌడీ మరియు KD కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అల్లర్లు, గొడవలు లేదా అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ WhatsApp +919392903413 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు.




