Dubbak: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ వనం రమేష్

Dubbak: దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' సభ.

Chindam Karunakar, Dubbak
Published on: 9 Jun 2026 11:10 AM IST
Dubbak
X

Dubbak: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ వనం రమేష్

సిద్దిపేట జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చివరి 10 రోజుల కార్యక్రమాల సందర్భంగా 9వ వార్డు కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 9 వ వార్డు సభ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కమిషనర్ మహేష్ కుమార్ మరియు 9వ వార్డ్ కౌన్సిలర్ వనం రమేష్ గారి అధ్యక్షతన లో సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని శాలువాతో సన్మానం చేయడం జరిగింది.

ఎస్సీ కాలనీ వాడే ట్యాంకు నుండి తాటికుంట వరకు కాలువ మరమ్మతు పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరడం జరిగింది. మరియు వివిధ రకాలైన 9వ వార్డు ధర్మాజీపేటలో 12 సమస్యలు పరిష్కరించాలని లేఖ రూపంలో వాడు సమావేశంలో అందరి సమక్షంలో మునిసిపల్ కమిషనర్ గారికి తొమ్మిదో వాడు కౌన్సిలర్ వనం రమేష్ అందజేయడం జరిగింది వీలైనంత త్వరగా సమస్యలు ఒకేసారి పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మెరుపుల సాయి,కర్ణంపల్లి రమేష్ గౌడ్, జనగామ విజయ్, ఐరన్ శివరాజం గౌడ్, పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story