Dubbaka: బీఆర్ఎస్ నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి చూడాలి!
Dubbaka: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు బురదజల్లుతున్నారని స్థానిక కౌన్సిలర్ మండిపడ్డారు.
Dubbaka: బీఆర్ఎస్ నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి చూడాలి!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 20 వార్డులలో ఎక్కడ జరగని అభివృద్ధి పనులు దుబ్బాక పట్టణంలోని 14 వ వార్డులో జరుగుతున్నాయి. వార్డులోని నేను గెలిచిన నెల రోజుల్లోనే పలు వీదుల్లో సిసి రోడ్లు నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం, కరెంట్ స్తంభాలు, నీటి వసతి కోసం పైప్ లైన్లు, పారిశుద్ధ నిర్వహణ పనులు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాను. కానీ కొంతమంది 14 వ వార్డు అభివృద్ధి చూసి ఓర్వలేక కావాలని పని కట్టుకొని నిందలు వేస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నారా... అయితే ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అభివృద్ధి మీకే కనబడుతుంది. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బస్తీ దవాఖాన మురుగు నీటి పాలయింది. దీంతో ఈరోజు అనగా బుధవారం కమిషనర్ రమేష్ కుమార్ సార్ తో, కాంట్రాక్టర్ తో దవాఖానను మురుగునీటి సమస్య పరిష్కరించి ఏ విధంగా త్వరగా ప్రారంభించాలని ఆలోచన చేయడం జరిగింది.




