Dubbaka: రైతులకు ఊరట.. ఎమ్మెల్యే హెచ్చరికతో దిగివచ్చిన సర్కార్!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరంతర పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది.

Chindam Karunakar, Dubbak
Published on: 24 May 2026 12:12 PM IST
Dubbaka
X

Dubbaka: రైతులకు ఊరట.. ఎమ్మెల్యే హెచ్చరికతో దిగివచ్చిన సర్కార్!

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరంతర పోరాటం ఫలించింది. పోరాటాల మధ్య పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుండి కొనుగోళ్లు ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడి హామీ ఇచ్చారు.

గత రెండు నెలలుగా పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తొగుట మార్కెట్‌లో వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు అండగా నిలిచి ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి రైతుల దుస్థితిని వివరించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story