Thoguta: తొగుట మహిళా సమాఖ్య అద్దె బస్సు ప్రారంభం.. మహిళా సంఘానికి నెలకు రూ.69,400 స్థిర ఆదాయం!

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండల మహిళా సమాఖ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.36 లక్షల విలువైన బస్సును మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 9 Jun 2026 5:11 PM IST
Thoguta: తొగుట మహిళా సమాఖ్య అద్దె బస్సు ప్రారంభం.. మహిళా సంఘానికి నెలకు రూ.69,400 స్థిర ఆదాయం!
X

Thoguta: హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహిళా సమాఖ్యలకు బస్సుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన సిద్దిపేట జిల్లా తొగుట మండల మహిళా సమాఖ్య సభ్యుల బస్సును మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చెరుకు విజయ్ అమర్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ గాంధారి నరేందర్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.మన తొగుట మహిళా సమాఖ్యల నుంచి రూ.6 లక్షల వాటాతో పాటు ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి మండల సమాఖ్యకు బస్సును కేటాయించడం మహిళా అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.ఈ బస్సును ఆర్టీసీకి అద్దెకు ఇస్తే ప్రతి నెల సుమారు రూ.69,400 రూపాయల ఆదాయం మహిళా సమాఖ్యకు సమకూరుతుందని తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story