Toguta: రైతుల సంక్షేమమే మా ప్రాధాన్యం.. ధాన్యం కేంద్రాల తనిఖీలో చైర్మన్!
Toguta: సిద్దిపేట జిల్లా తొగుటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి.
Toguta: రైతుల సంక్షేమమే మా ప్రాధాన్యం.. ధాన్యం కేంద్రాల తనిఖీలో చైర్మన్!
సిద్దిపేట జిల్లా: తొగుట మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ సెంటర్‌లో మరియు తుక్కపూర్ గోదాం లలో రైతుల నుండి ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం దిగుమతుల ప్రక్రియను మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చెరుకు విజయ్ అమర్ రెడ్డి గారు పరిశీలించారు.
ధాన్యం దిగుమతి ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ విజయ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల మేరకు వేగంగా కొనుగోలు చేసి, ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పారదర్శకతతో వ్యవహరించాలన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు.




