Viral: ఇదేం వింత మావ.! ఆ ఊరిలో కుక్కతో పిల్లలకు పెళ్లి చేస్తారట.! ఎందుకంటే.?

Viral: చిన్న పిల్లలకు పైన పన్ను వస్తే కుక్కతో పెళ్లి చేయడం, జాతకాల కోసం కోడిపిల్లలను బలి ఇవ్వడం లాంటి వింత సంప్రదాయాలు మన దేశంలోనే ఉన్నాయని మీకు తెలుసా.?

Ravi
By Ravi
Published on: 9 Jun 2026 4:58 PM IST
Viral: ఇదేం వింత మావ.! ఆ ఊరిలో కుక్కతో పిల్లలకు పెళ్లి చేస్తారట.! ఎందుకంటే.?
X

Viral: మన దేశంలో ఎన్నో రకాల విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే కొన్ని గిరిజన ప్రాంతాల్లో పాటించే ఆచారాలు చూస్తే మాత్రం మనకు ఎంతో ఆశ్చర్యం కలగక మానదు. సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చిన్న పిల్లలకు పళ్లు రావడం అనేది ఎంతో సంతోషకరమైన ఘట్టం. కానీ, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో నివసించే 'ముండా' గిరిజన తెగలో మాత్రం దీనికో వింత నమ్మకం ఉంది. ఆ తెగకు చెందిన పిల్లలకు ముందుగా పైదవుడకు పన్ను వస్తే, దానిని వారు అరిష్టంగా భావిస్తారు. ఆ కీడును తొలగించడానికి, ఆ దరిద్రాన్ని వదిలించుకోవడానికి వారు ఆ చిన్నారికి ఏకంగా ఒక కుక్కతో ఘనంగా వివాహం జరిపిస్తారు. అయితే, ఇలా కుక్కను పెళ్లి చేసుకున్న వారు జీవితాంతం అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఆ కీడు తొలగిపోయిందని భావించి, వారు పెద్దయ్యాక మళ్లీ సాధారణంగా మనుషులను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.

కోడిపిల్లల కాలేయంతో జ్యోతిష్యం:

కేవలం కుక్కలతో పెళ్లి చేయడమే కాదు, ఇక్కడ వివాహాలకు సంబంధించి మరో వింత సంప్రదాయం కూడా ఉంది. ఈ ముండా గిరిజన తెగలో ఎవరికైనా పెళ్లి నిశ్చయించే ముందు వధూవరుల జాతకం, శుభ ముహూర్తాలు నిర్ణయించడం కోసం కోడిపిల్లలను బలి ఇస్తారు.

బలి ఇచ్చిన ఆ కోడిపిల్లల కాలేయం రంగును నిశితంగా పరిశీలించి, దాని ఆధారంగా జ్యోతిష్యం చెబుతారు. ఆ కాలేయం రంగును బట్టే ఆ కొత్త జంట భవిష్యత్తు ఎలా ఉంటుందో, పెళ్లికి ఏ సమయం అనుకూలమో అక్కడి పెద్దలు నిర్ణయిస్తారు. బయటి ప్రపంచానికి ఇవి ఎంతో వింతగా, మూఢనమ్మకాలుగా అనిపించినా.. ఆ గిరిజన ప్రజలకు మాత్రం ఇవి వందల ఏళ్లుగా వారి పూర్వీకుల నుంచి వస్తున్న పవిత్రమైన ఆచారాలు కావడం గమనార్హం.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story