Silver Anklets Benefits: కాలి పట్టీలు... సంప్రదాయం ఒక్కటే కాదు...అద్భుతమైన సైన్స్‌కూడా దాగుంది

మహిళలు వెండి పట్టీలు ధరించడం వలన ఆరోగ్యంతో పాటు కొన్ని కీలకమైన దోషాలు కూడా తొలిగిపోతాయి. అవేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 9 Jun 2026 8:38 AM IST
Silver Anklets Benefits: కాలి పట్టీలు... సంప్రదాయం ఒక్కటే కాదు...అద్భుతమైన సైన్స్‌కూడా దాగుంది
X

Silver Anklets Benefits: మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, పట్టీలు పెట్టుకోవడం అన్నది సంప్రదాయం. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని మహిళలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు, వెండి పట్టీల వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వెండి చంద్రుడికి ప్రతీకగా చెబుతారు. ఈ వెండి పట్టీలు ధరించడం వలన చంద్ర, రాహుకేతు దోషాలు కూడా తగ్గిపోతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. శాస్త్రీయంగా కూడా దీని వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

మహిళలు - వెండి పట్టీలు

చిన్నారులు, మహిళలు వెండి పట్టీలు ధరించి ఇంట్లో నడుస్తుంటే లక్ష్మీదేవి నట్టింట నాట్యం చేస్తున్నట్టుందని పెద్దలు చెబుతారు. పట్టీలు ధరించడం వలన ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వడదెబ్బ, ఎండల వలన కలిగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. అంతేకాదు, శరీరంలోకి అనుకూలమైన శక్తులు ప్రవేశించే విధంగా చేస్తుందని పండితులు చెబుతున్నారు. వీటిలో పాటు ఈ పట్టీలు పలురకాలైన బ్యాక్టీరియాలను కూడా అడ్డుకుంటుంది. ఇక జ్యోతిష్యశాస్త్రం పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

పట్టీలు - జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న రహస్యాలు

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండటం వలన పలు రకాలైన దోషాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి నుంచి బయటపడాలంటే కాళ్లకు వెండి పట్టీలు ధరించాలని చెబుతారు. అదే పురుషులైతే వెండి కడియాలు ధరించాలి. ఇలా చేయడం వలన చంద్రగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మనస్సు స్థిరంగా మారుతుంది. భావోద్వేగాలు నియంత్రించబడతాయి. మానసికంగా శాంతి లభిస్తుంది. ఒత్తిడి నుంచి కూడా రక్షణ కలుగుతుంది.

రాహుకేతు దోష నివారణ కోసం వెండిని కూడా ఉపయోగిస్తారు. శని బాధల నుంచి విముక్తి లభించాలంటే వెండి ఆభరణాలు ధరించాలని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఇక సైన్స్‌ పరంగా తీసుకుంటే వెండి విద్యుత్‌ కండక్టర్‌ వంటిది. ఇది శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. ప్రతికూల శక్తులను అడ్డుకొని అనుకూల శక్తులు ప్రవహించేలా చేస్తుంది. దీనినే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ బ్యాలెన్స్‌ అని పిలుస్తారు. వెండిలో ఉండే యాంటి బ్యాక్టిరియల్‌ లక్షణాల కారణంగా చర్మసంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. నాడీ వ్యవస్థను బలంగా ఉండేలా చేయడంలో వెండి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story