Tandur: నూతన పాలకవర్గంకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
Tandur: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కొత్లాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
Tandur: నూతన పాలకవర్గంకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
Tandur: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కొత్లాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన నూతన చైర్మన్ పట్లోళ్ళ ప్రవీణ్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..
ఆలయంలో అన్ని మౌలిక సదుపాయాలు చేసుకున్నామని అన్నారు. తెలంగాణ కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలియజేశారు .ఎల్లమ్మ దేవాలయంను ప్రభుత్వ వెబ్ సైట్ లో చేర్చేటట్లు ప్రయత్నం చేస్తానని అన్నారు.
ఆలయ చైర్మన్ కు 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని,ఆలయ అభివృద్ధికి దోహదపడి, మంచిపేరు తెచ్చుకోవాలని నూతన చైర్మన్ కు మరియు పాలకమండలికి సూచించారు. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలను (జుంటుపల్లి, బద్రప్ప దేవాలయం, ఏకాంబరి, పోట్లి మహారాజ్) అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
ముస్లిం సోదరులకు మసీదులు, కబ్రస్తాన్, ఈద్గా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, క్రిస్టియన్ సోదరులకు చర్చిలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రకళ, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు వడ్డే శ్రీను, బాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నాగప్ప, నాయకులు సాయిలు, నవీన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




