Jammikunta: నంది జాతీయ పురస్కార గ్రహీతలను సన్మానించిన బీసీ ఉద్యోగ సంఘాల నేత
Jammikunta: ప్రతిష్టాత్మక మహానంది జాతీయ పురస్కారాలు అందుకున్న జమ్మికుంట ప్రాంత ప్రముఖులను బుధవారం ఘనంగా సన్మానించారు.
Jammikunta: నంది జాతీయ పురస్కార గ్రహీతలను సన్మానించిన బీసీ ఉద్యోగ సంఘాల నేత
Jammikunta: మార్చి 29నతెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్ లో తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు జాతీయ పుర స్కారాల ప్రధానోత్సవం వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వారికి నంది అవార్డులను అందజేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతము నుండి సామాజిక సేవ, మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ బూషి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాసేవ రంగంలో టంగుటూరి రాజ్ కుమార్, విద్యా, సేవా రంగంలో చిటికెన వేణు, విద్యా, సేవా రంగంలో గుడిమిల్ల బలరాం, సామాజిక సేవా రంగంలో శ్రీరామోజు మహేంద్ర చారి , ప్రజా సేవా రంగంలో గూడూరి శ్రీనివాస్ రెడ్డి, సామాజిక సే వా రంగంలో రాంపెల్లి జయప్రకాష్ ఉగాది మహానంది జాతీయ పురస్కారం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు .
బతుకమ్మ తల్లి గ్రంథకర్త, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత డా. రంగాల శాంతి కృష్ణ ఆచార్య, సినీ హాస్యనటుడు ఆర్.ఎస్. నంద, సహజనటి రాధిక, బూట్ల రాజమల్లయ్య, కాసుల కిరణ్ కుమార్, సంస్థ జాతీయ అధ్యక్షుడు పోలోజ్ రాజ్ కుమార్ చేతుల మీదు గా అందుకున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం జమ్మికుంట పట్టణంలోని చాణిక్య డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు దబ్బెట రవీందర్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. వివిధ రంగాల్లో సేవ చేసినందుకు గుర్తింపు గా వీరిని మహానంది జాతీయపురస్కారము ప్రధానోత్సవం ప్రధానం చేసినందుకు తెలుగు వెలుగు సాహితి వేదికకు వారికి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో కాసుల కిరణ్ కుమార్ ,బొజ్జ వేణు, దొడ్డె కిరణ్ కుమార్, సైదాబాద్ ఉపసర్పంచ్ ఉష్క మల్ల తిరుపతి, పాత ప్రసాద్, పాల్గొన్నారు.




