Jammikunta: అవినీతిపై నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయండి.. మున్సిపల్ కమిషనర్
Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఆర్పీలు (RPs) ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ హెచ్చరించారు.
Jammikunta: అవినీతిపై నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయండి.. మున్సిపల్ కమిషనర్
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అర్పిలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని మున్సిపల్ చైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ లు అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అర్పిలతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్, చైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోర్ డోర్ చెత్త సేకరణ, మున్సిపల్ అభివృద్ధిలో అర్పిల పాత్ర చాలా కీలకమైనదన్నారు. అర్పిలు సంఘాలకు బ్యాంక్ నుండి లోన్ ఇప్పించడం బాధ్యత అని వారు అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
సంఘ సభ్యులు లోన్ ఇచ్చే ముందు డబ్బులు అడుగుతున్నారని మా దృష్టికి కానీ, ఏసీబీ అధికారులకు గానీ సమాచారం నేరుగా ఇవ్వవచ్చు అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, మెప్మా ఇంచార్జి టి.ఏం.సి మల్లీశ్వరి, సి.ఎల్.అర్పిలు, అర్పిలు, సమాఖ్య ఓబీలు పలువురు పాల్గొన్నారు.




