గ్రామానికి 'కీడు' సోకిందని వనవాసం.. తాళాలు వేసి అడవిబాట పట్టిన జనం
Keshavapur: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
గ్రామానికి 'కీడు' సోకిందని వనవాసం.. తాళాలు వేసి అడవిబాట పట్టిన జనం
Keshavapur: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామం లో గత రెండు ,మూడు నెలల నుండి వరుస మరణాలు సంభవిస్తున్నయని గ్రామ పురోహితున్నీ సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని గ్రామం లో ఉన్న ప్రజలు ఒక రోజు గ్రామస్థులందరూ ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్ళాలని సూచించారు. అయితే ఒక రోజు ముందు గ్రామం లో డప్పు చాటింపు చేసి నేడు తెల్లవారుఝామున ఇండ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్ళారు గ్రామస్థులు.
కీడు వంటలకు వెళతామని చెప్పినప్పటి నుండి గ్రామం లో మరణాలు ఆగాయని అంటున్నారు గ్రామస్థులు. గ్రామ మొదట నడిరోడ్డు మీద రాత్రి విచిత్రమైన బొమ్మ గీసి నడిరోడ్ వాహనాలు నడిచే రోడ్డు పై బొమ్మలకు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ దిష్టి తీసి రక్తంతో నింపి తెల్లవారుజాము న్నే ఇల్లాలకు తాళాలు వేసి వనభోజనానికి వెళ్లారు గ్రామస్తులందరూ చిన్న పెద్ద ముసలి వాళ్లు తేడా లేకుండా ఊరు ఊరంతా కదిలింది వనంలో వంట వార్పు చేసుకుని ఇక్కడే తిని సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతామని పురోహితుడు చెప్పిన ప్రకారం ఇండ్లలోకి వస్తామన్నారు




