Renigunta: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా రేణిగుంటలో వామపక్ష పార్టీల రాస్తారోకో
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది.
Renigunta: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా రేణిగుంటలో వామపక్ష పార్టీల రాస్తారోకో
Renigunta: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం రేణిగుంటలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇంధన ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రేణిగుంట కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ మాట్లాడుతూ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు నిరంతరం పోరాటం కొనసాగిస్తాయని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు,పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




