Tirupati: హైదరాబాద్ టు తిరుపతి.. రైలులో ప్రయాణించిన ఎమ్మెల్యే!
Tirupati: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుపై అవగాహన కల్పించేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వినూత్నంగా స్పందించారు.
Tirupati: హైదరాబాద్ టు తిరుపతి.. రైలులో ప్రయాణించిన ఎమ్మెల్యే!
Tirupati: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వందేభారత్ రైలులో ప్రయాణించి తిరుపతికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.భవిష్యత్తులో ఇంధన కొరత సమస్య తలెత్తకుండా ఉండేందుకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ కీలక సూచనలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఇంధన వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.వాహనదారులు,కూటమి కార్యకర్తల్లో అవగాహన కల్పించేందుకు తాను కుటుంబ సభ్యులతో కలిసి వందేభారత్ రైలులో ప్రయాణించినట్లు తెలిపారు.ప్రజలు సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగిస్తూ ఇంధనాన్ని ఆదా చేయాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.




