Jordar News: సీఎం విజయ్ ని ఓడించిన బుడ్డోడు
Jordar News: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరియు చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మధ్య జరిగిన ఆసక్తికరమైన చెస్ ఆట.
Jordar News: సీఎం విజయ్ ని ఓడించిన బుడ్డోడు
Jordar News: దున్యాల్నే గొప్పగ పేర్వోయినోళ్ల ఎత్తులనే చిత్తు జేశే ప్రజ్ఞానంద సీఎం విజయ్ ఏశ్న ఎత్తులను ఉత్తగనే తుత్తునీయలు జేశిండు. సిన్మాల్ల హీరో కమ్ సీఎం విజయ్ కి మస్తు క్రేజ్ ఉన్నది. ఇగ రాజకీయంల సుతం ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులేశి పార్టీ పెట్టినంక అచ్చిన మొదటి ఎన్నికల్లనే గెల్శి ముఖ్యమంత్రి అయ్యిండు. రాజకీయంల ఏశ్న ఎత్తులన్ని సక్సెస్ అయినయిగనీ., చెస్ అనే ఆటల ఏశే ఎత్తులు మాత్రం ఉత్తయే అయినయి.
ఎందుకంటె ఎదురుంగ ఉన్నది మామూలు ఆశామాశీ ఆటగాడుగాదు., గ్రాండ్ మాస్టర్. కావట్టి ఎక్కో ఎత్తులు గుడ కాకముందే., ప్రజ్ఞానంద ముఖ్యమంత్రికి చెక్‌మేట్ వెట్టిండు. అటెంక ప్రజ్ఞానంద మాట్లాడుకుంటా.. సీఎంతోని చెస్ ఆడే అవకాశం అత్తదనుకోలేదని మస్తు సంబురపడ్డడు. రాజకీయ వ్యూహాలు పన్నినంత అల్కక చెస్ వ్యూహాలు పన్నినా అవి వర్కవుట్ కావని కొందరంటే., రాజకీయాల ఎత్తుగడలైనా, చెస్ ఎత్తుగడలైనా విజయ్ స్టైలే వేరున్నది పోండ్రని కొందరు.
విజయ్ అట్ల సూటేస్కోని ఆడుతుంటే నిజంగ ప్రొఫెషనల్ చెస్ ఆటగాని లెక్కన్నే ఉన్నడని కొందరు కామెంట్ల మీద కామెంట్లు పెడ్తున్నరు. ఇగ విజయ్ అభిమానులైతే., ఆటగాళ్లను ప్రోత్సహించడానికి విజయ్ ఏశ్న మొదటి ఎత్తుగడ ఇదే అని అంటున్నరు. మరిగ రేపురేపట్ల విజయ్ సారు క్రీడాకారులను ముంగట్కి తీస్కపోడానికి ఇంకా ఏం జేస్తడో సూడాలె మరి.




