Visakhapatnam: శ్రీచైతన్య హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని దారుణ ఆత్మహత్య.. అసలేమైంది?
Visakhapatnam: విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలోని కాపులుప్పాడ శ్రీచైతన్య హాస్టల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నడుమురి జ్యోత్స్న (16) ఆత్మహత్య చేసుకుంది.
Visakhapatnam: శ్రీచైతన్య హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని దారుణ ఆత్మహత్య.. అసలేమైంది?
విశాఖపట్నం జిల్లా: భీమిలి పరిధిలోని కాపులుప్పాడ ప్రాంతంలో ఉన్న శ్రీచైతన్య హాస్టల్‌లో నివాసం ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని నడుమురి జ్యోత్స్న (16)ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, విజయనగరం జిల్లా వుడాకొలనీకి చెందిన విద్యార్థిని స్థానిక శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




